ఈ ఏరియా మీ వై సి పీ జాగీర్ ఏం కాదు..

నెల్లూరు: నగర డివిజన్ వై సి పీ కార్పొరేటర్లకు వారి బంధువులకు ఆ ప్రదేశాన్ని రాసిచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్దతి కాదు.. అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు సిటీ టౌన్ హౌస్ పేట ఎస్బిఎస్ కళ్యాణ మండపం ముందు శనివారం మీడియాతో మాట్లాడారు.. నెల్లూరు సిటీ కార్పొరేటర్లు మరియు వారి బంధువులు పెత్తందారులుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామానికి విరుద్ధంగా వేరే పార్టీ మా డివిజన్లోకి రాకూడదు వేరే నాయకులు తిరగకూడదు అంటూ సైనికులను బెదిరిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడా మా జనసేన స్థానిక జనసేన ఆరో వార్డు ఇంచార్జ్ సుమంత్ జనసేన నాయకులను తీసుకొచ్చినప్పుడు. దశాబ్దాలుగా వారు పనిచేసుకునే షాపుల ముందు ఉన్న పట్టలను తొలగించి అధికారులు గందరగోళం చేశారు. పై పెచ్చు స్థానిక నాయకులకు క్షమాపణలు చెప్తే పర్వాలేదని చెప్పటం దారుణం. నిన్న కలుషితమైన నీరు వస్తుంది సరిగా మంచినీరు అందట్లేదు అని తెలపడంతో ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి అనంతరం స్థానిక వ్యాపారస్తుల్ని కలవడం జరిగింది. నెల్లూరు స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది. ఏ పార్టీ పెద్దలు వచ్చినా వాళ్లని షాపులకు వస్తే వ్యక్తిగత పరిచయాల వల్ల కానీ పార్టీ మీద అభిమానం కానీ వారిని గౌరవించడం సహజం. అలాగే వాళ్లకు ఇష్టం వస్తే వాట్సప్ స్టేటస్ లు కూడా పెట్టుకుంటారు.. స్థానిక కార్పొరేటర్ కుమారుడైన శ్రీదర్ అధికారులతో ఫోన్ చేయించి ఫైన్లు కట్టిస్తామని వ్యాపారం ఇబ్బంది పెడతామని బెదిరిస్తున్నారట. ఆ పిల్లోడికి సరిగా తెలిసినట్లు లేదు కనీసం ఎమ్మెల్యే గానీ వారు పై స్థాయి నాయకులని కానీ అడిగి తెలుసుకోమనండి. సరైన విషయం పరిజ్ఞానం లేక హాఫ్ నాలెడ్జ్ తో ఎవరైనా కలిసినా వాట్సాప్ స్టేటస్ ఫోటోలు పెట్టిన అధికారులతో బెదిరించి ఫైన్లు కట్టిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శ్రీధర్ గారు ఇది మంచి పద్ధతి కాదు మరలా ఇలా గాని జరిగిందంటే జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజల ఓట్లతో గెలిచిన మీకు అంత గర్వం పనికిరాదు, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంది. మీరు సమస్యలపై సకాలంలో స్పందిస్తే అసలు ప్రతిపక్షాల ఊసే అవసరం ఉండదు.
జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఆరాధిస్తున్నారు.సమయం వచ్చినప్పుడు మా సత్తా చూపిస్తాము. అధికారం శాశ్వతం కాదు ఆ విషయాన్ని కార్పొరేటర్ లు అధికారులు మనుసులో పెట్టుకొని వ్యవహరించాలి. అధికారులు అడ్డగోలుగా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మాకు వేరే ఛాయిస్ లేదు వ్యాపారం మీదికి రైడ్ కొస్తున్నామంటూ చెప్పడం సరైన పద్ధతి కాదు. వాట్సప్ స్టేటస్ లకూ మనుషుల్ని పలకరించిందానికి తప్పు అయిపోయింది అంటూ వినతి పత్రాలు రాయాలంటే మంచి పద్ధతి కాదు. డివిజన్లో మీ వాళ్ళు తిరగలేక పోతే మీరు తిరిగి వారు బాధలు కష్టాలు, నష్టాలు కనుక్కొని పరిష్కరించడానికి చూడండి. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, 6వ డివిజన్ జనసేన ఇంచార్జి సుమంత్, తేజ, షాజహాన్, శరవణ, వర్షన్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.