కళ్యాణ్ దేవ్ సినిమాకి టైటిల్ ఫిక్స్.. పోస్టర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్, రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రజనీ తాళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు `కిన్నెరసాని` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు దీపావళి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటంది.

పోస్టర్ క్రియేటివ్‌గా ఉంది. సముద్రపు ఒడ్డున ఒక పుస్తకానికి గొలుసుతో తాళం వెయ్యడాన్ని చూస్తుంటే ఈ సినిమా విభిన్న కథాంశంతో రూపొందుతుందున్నట్టు అర్దమవుతుంది. రొటీన్‌కు భిన్నంగా సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నవ్యమైన అంశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. దేశరాజ్‌ సాయితేజ కథ, కథనం, మహతి స్వరసాగర్‌ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తాయి. అతి త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు .