జనసేన నాయకుడు “శివ కోటీ యాదవ్” కి సన్మానం

*జనసేన నాయకుడు “శివ కోటీ యాదవ్”ని సన్మానించిన “షిటో-రియో జపాన్ కరాటే డూ ఇండియా హంబు సంస్థ” నిర్వాహకులు.

ఈ నెల 6న వరంగల్ జిల్లా నర్సంపేటలో షిటో-రియో జపాన్ కరాటే డూ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలకు జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు శివకోటీ యాదవ్ హాజరయ్యి విజేతలకు బహుమతులు ప్రదానం చేయవలసి ఉండగా, హైదరాబాదులో పార్టీ ముఖ్య సమావేశం ఉండటంతో ఈ కరాటే పోటీల కార్యక్రమంలో హాజరు కాలేకపోవడం వల్ల, ఆ సంస్థ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ షిహాన్ రచ్చ భవానీ చంద్(బ్లాక్ బెల్ట్ 5 వ డాన్), సీనియర్ ఇన్స్ట్రక్టర్ గుంటి అశోక్(బ్లాక్ బెల్ట్ 3 వ డాన్) లు జనసేన నాయకులు శివకోటీ యాదవ్ ని వారి గృహంలో కలిసి శాలువ, మెమెంటోతో సన్మానించడం జరిగింది.” ఈ సందర్భంగా మేరుగు. శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ స్వీయ రక్షణ, క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శారీరక మరియు మానసిక దృఢత్వంని మెరగు పరుచుకోవడంలో కరాటే ఎంతో మేలు చేస్తుందని, అలాగే దాదాపు 30 సంవత్సరాల నుండి ఎన్నో వేల మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరాటే చాంపియన్లుగా నిలిపి ప్రయోజకులను చేసిన రచ్చ శ్రీను బాబు(క్యోషి ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్, బ్లాక్ బెల్ట్ 7వ డాన్) నర్సంపేట ప్రాంత వాసి అవడం గర్వకారణమని, జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.