కణితి కిరణ్ అధ్యర్యంలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు

టెక్కలి: శ్రీమతి సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా, వారి సేవలను స్మరించుకుంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో ఇంచార్జ్ కణితి కిరణ్ అధ్యర్యంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కణితి కిరణ్ మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే గారు స్త్రీ విద్యా విప్లవ కారిణి, నేటి మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత స్త్రీల బానిసత్వానికి విముక్తి మార్గదర్శిణి విద్యా విజ్ఞానం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను స్త్రీ జాతికి ప్రసాదించి అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త అని, భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే గారు ఎందరో మహిళల జీవితాలలో అక్షర కాంతులు నింపిన తొలితరం ఉపాధ్యాయిని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు పెడడా త్రివేణి రావు, కొత్తూరు హరి, కుమారస్వామి, మెట్ట నరేష్, క్రాంతి, గణపతి, తదితరులు పాల్గొన్నారు.