భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధం

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో పాటు పలు వేరియంట్లు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదే సమస్యను ప్రపంచంలోని పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ జాబితాలో భారత్ తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. జులై 21 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని, ఆయా దేశాలకు తమ ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకూడదని యూఏఈ తెలిపింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అయితే ఛార్టర్డ్, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది.