అమ్మిశెట్టి ఆధ్వర్యంలో వీరమహిళలకు ఘన సత్కారం

  • వీర మహిళలంటే ధైర్యం, తెగువకు నిదర్శనం
  • అమ్మిశెట్టి ఆధ్వర్యంలో న్యూఇయర్ సందర్భంగా వీర మహిళలకు సత్కారం

విజయవాడ: జనసేన పార్టీకి నిస్వార్ధంగా సేవలందించే వీరమహిళలను కొత్త సంవత్సరం నాడు సత్కరించుకోవడం నా పూర్వ జన్మ సుకృతమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకోని సోమవారం మొగల్రాజపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అమ్మిశెట్టి వాసు, సుజాత దంపతుల ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలలైన 70 మంది ఆడపడుచులకి సత్కారం చేసి స్వీటు బ్యాక్స్, నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏదీ ఆశించకుండా పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న వీర మహిళలకు 2023 సంవత్సరాన్ని అంకితమిస్తున్నానన్నారు. వీరమహిళలంటే ప్రభుత్వానికి జంకు వస్తుందంటే, అది వాళ్ల ధైర్యం, తెగువకు నిదర్శనమన్నారు. నా రాజకీయ ప్రస్థానంలో నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి అనిత, చాయదేవి, ఆలియా బేగం, దోమకోండ మేరీ, ఉమా లక్ష్మీ, అమ్మిశెట్టి అనూష, గుంటుపల్లి సుజాత, జిగడం లక్ష్మీ, చందు సుజాత, పాల్ రజనీ, మాకినీడు నీరజ తదితరులు పాల్గొన్నారు.