పెదయాదర సర్పంచ్ ఆధ్వర్యంలో కంప్యూటర్ దాతకు చిరు సత్కారం

కృష్ణాజిల్లా, మచిలీపట్నం స్థానిక పెదయాదర పంచాయతీలో గవర్నమెంట్ పాఠశాల నందు గతంలో పాఠశాలకు నాడు నేడు ప్రోగ్రామ్ కింద అర్హత పొందడానికి వీలైనంత మంది విద్యార్థుల శాతం లేనందునగత రెండు దఫాలుగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు నోచుకోక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ విషయాన్ని హెడ్ మాస్టర్ ద్వారా విని పాఠశాలలో ఒక కంప్యూటర్ మరియు ఆట వస్తువులు ఇతరత్రా సామాగ్రి అవసరతను గుర్తించి వాటిని సమకూర్చిన దాత ముళ్లపూడి సుబ్బారావుని బుధవారం జరిగిన పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ ద్వారా స్కూల్ హెడ్మాస్టర్ మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ అలాగే గ్రామ సర్పంచి గల్లా తిమోతి ఆధ్వర్యంలో సుబ్బారావుని సగర్వంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కంప్యూటర్ దాత సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యను జ్ఞానం సంపాదించుకునే దిశగా నేర్చుకునే విధంగా అలవర్చుకోవాలని అలనాటి స్వాతంత్ర సమరయోధులు కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించడం వల్ల మనకు స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారని అన్నారు అలాగే గ్రామ సర్పంచ్ గల్లా తిమోతి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను బట్టి నాడు-నేడు ప్రోగ్రాం కండక్ట్ చేయడం తగదని, రెండు గ్రామాలకు కలిపి ఉన్న ఈ స్కూలు అందరికీ ఉపయోగకరమని అలాగే ఈ స్కూలు ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం వెంటనే నాడు-నేడు కింద జతపరిచి తదనుగుణంగా ఆధునీకరణ ను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి సర్పంచ్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.