జనసేనలో చేరిన ఉంగుటూరు నియోజకవర్గ ప్రముఖులు

పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. లక్ష్మి నారాయణ ఫౌండేషన్ చైర్మన్ పర్వమట్ల ధర్మరాజు, ఫౌండేషన్ సభ్యులు వంగా రఘురామచంద్ర శేఖర్, చింతలపాటి వెంకట సత్యనారాయణరాజు(బాపిరాజు), పొత్తూరి కృష్ణంరాజు(వాసు) తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికి పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. వీరంతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది.