హెచ్1బీ వీసాదారులకు అమెరికా స్వాగతం

కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో హెచ్1బీ వీసాదారులను అమెరికాలోకి ఈ ఏడాది చివరివరకు నిషేదిస్తూ జూన్ 22న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. కానీ తాజాగా హెచ్1బీ వీసాదారుల కు అమెరికా ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇదివరకు పని చేసిన ఉద్యోగాలు చేసేందుకైతే అమెరికాకు తిరిగి రావొచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు ట్రావెన్ బ్యాన్ విధించక ముందు ఆ వీసాలు కలిగి ఉన్న వారికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాక వెల్లడించింది.

ప్రైమరీ వీసా కలిగి ఉన్న వారితో పాటు వారి భార్య లేక భర్త, పిల్లలను కూడా అమెరికాలోకి ఏ ఆంక్షలు లేకుండా అనుమతిని కల్పిస్తుంది. అమెరికా ఆర్థిక మాంద్యం దిశగా వెళ్లకూడదంటే సాంకేతిక నిపుణులు, సీనియర్ లెవల్ మేనేజర్స్, హెచ్1బీ వీసా కలిగిఉన్న కీలక ఉద్యోగస్తుల సేవలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ విభాగం, డాక్టర్లు, వైద్య నిపుణులు, రీసెర్చ్ విభాగంలో సేవలందిస్తున్న వారిని తిరిగి అమెరికా రావాలని ఆహ్వానం పలికారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, టెక్ ఉద్యోగులు యథావిధిగా గతంలోలాగ తమ సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు.