వైఎస్ఆర్సిపి పార్టీ కాపు నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వబ్బిన శ్రీకాంత్

పెందుర్తి, నరవ గ్రామం, 88 వార్డ్, నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కాపు నాయకులు అందరూ కలిసి కాకినాడలో మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు కాపు కులస్తులకు ఏమి చేశాము వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవన సరళి లో ఏమైనా మార్పు వచ్చిందా అని వాటిపై చర్చించకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వ అభివృద్ధి ఏ విధంగా అణచివేయాలి, ప్రజల నుండి జనసేన పార్టీని ఏ విధంగా దూరం చేయాలి అనే విషయాలపై చర్చించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని, వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టి 11 సంవత్సరాలు, అధికారం వచ్చి సుమారు మూడున్నర సంవత్సరాలు అవుతున్న ఎప్పుడు కాపు నాయకులు ఇటువంటి మీటింగ్ పెట్టలేదని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి మీటింగ్ పెట్టడం అతిశయోక్తిగా ఉందని, సంవత్సరానికి 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు ప్రజలకు అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం గడిచిన మూడున్నర సంవత్సరం కాలంలో ఎంతమందికి నిధులు మంజూరు చేసాం, కాపు నేస్తం ద్వారా ఎంతమంది కాపు మహిళల జీవనసరళిలో మార్పు వచ్చిందో, ఎంతమంది కాపు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, వంగవీటి మోహన్ రంగాని ప్రజలు కోల్పోయారని, రంగాని ప్రజల నుండి ఎవరు దూరం చేశారో ప్రజలకు తెలుసని, కాపులకు 10 శాతం రిజర్వేషన్ కావాలని అప్పటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఈరోజు మన పక్కన ఉన్న తెలంగాణ అందరూ కలిసి, అన్ని పార్టీలు సంఘాలు కలిసి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించారని, కానీ మన ఆంధ్రప్రదేశ్ వస్తే ప్రజలకు మన ప్రాంతం, మన సమాజం, మన ప్రజలు అనే భావన లోపిస్తూ స్వార్థంగా నా కుటుంబం, నాకు అనే భావన ఎక్కువగా ఉంటుందని, దీన్ని ప్రజలు వీడనాడలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రిని స్టీల్ ప్లాంట్ కోసం పెద్దన్న పాత్ర వహించి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వద్దామని అడిగితే ఇప్పటివరకు ఎటువంటి కార్యచరణ చేయకుండా మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలు అవగాహనతో ప్రభుత్వ చర్యలను తిప్పి కోడుతున్నారని, ఈ ప్రభుత్వం ఎంత దిగజారుడుగా ఆలోచిస్తుందంటే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉదాహరణ అని, అతి సామాన్య ప్రజలు నాలాంటి చదువుకున్న వ్యక్తులపై సుమారు 170 ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా సమర్ధించుకుంటుందని దీనికి స్థానిక వైఎస్సార్సీపి నాయకులు సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ ని ఒక రూమ్ లో నిర్బంధన చేయవచ్చు కానీ ప్రజల నుండి జనసేన ను ఈ వైఎస్ఆర్సిపి పార్టీ దూరం చేయలేదని, విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి అని నిదర్శనం, ప్రభుత్వ చర్యలును తిప్పి కొట్టడంలో జనసేన పార్టీ విజయం సాధించింది, తప్పకుండా 2024లో ప్రజలందరూ జనసేన పార్టీనీ ఆదరించడానికి సన్నద్ధులుగా ఉన్నారని, జనసేన పార్టీని స్థాపించి పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, దనికులుకు ఒకే చట్టం అమలయ్యేలాగా పరిపాలన చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అమలు చేయాలో చూపిస్తామని, జనసేన పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.