వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్.!

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ లాయర్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.

42 సెకన్లు ఉన్న మోషన్ పోస్టర్ లో సత్యమేవ జయతే అంటూ ప్లే అవుతుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు దీనిని విడుదల చేసారు. బోనీ కపూర్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే సెట్స్ పై షూట్ కి వెళ్ళే అవకాశం ఉంది.

పవన్ బర్త్ డే సందర్భంగా మూడు అప్‌డేట్స్ ఉంటాయని ముందుగా తెలిసిందే. అందులో తొలి సర్‌ప్రైజ్ వకీల్ సాబ్ మూవీ నుంచి పవన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదివరకే ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా మోషన్ పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.