ముకుంద నాయుడుకు భీమా చెక్కును అందించిన వంగ లక్ష్మణ్ గౌడ్

వనపర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, రాదారం రాజలింగంల సూచన మేరకు ఇటీవల కార్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముకుంద నాయుడుకు సభ్యత్వ భీమా మెడికల్ క్లైమ్ 50వేల రూపాయల చెక్కును, గురువారం వనపర్తి నియోజకవర్గం, పెబ్బర్ మండలం, పెంచికలపాడు గ్రామంలో ముకుంద నాయుడు కు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో భీమా చెక్కును జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ అందజేసారు. ఈ సందర్భంగా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఎం డిమహబూబ్, బైరపొగు సాంబ శివుడు, రాకేష్ రెడ్డి, ముకుంద నాయుడు కు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించి, వారి కుటుంబానికి పార్టీ భరోసాగా నిలబడినందుకు వనపర్తి నియోజకవర్గ నాయకులు జి. బాలకృష్ణ నాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్య, వంశీ రెడ్డి, విజయ్, సంతోష్, రాజు నాయక్, హేమ వర్ధన్, రవి కుమార్, బిచుపల్లీ, పి. భాస్కర్, బన్నీ, బాలరాజు, రమేష్, పులెందర్, ఆంజనేయులు, రాజ్ కుమార్, శివ, గురు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.