వంగవీటి మోహన రంగా సేవలు మరువలేం: బండారు శ్రీనివాస్

*పేద ప్రజల ముద్దుబిడ్డ! అన్ని వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన రంగా సేవలు మరువలేం! 75వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు బండారు శ్రీనివాస్, జనసేన కుటుంబం!

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ రథసారథి, ప్రముఖ జనసేన నేత, ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ సోమవారం ప్రముఖ నేత, స్వర్గీయ వంగవీటి మోహనరంగా 75వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. వారు పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలబడిన గొప్ప నాయకుడని.. ఏప్పుడూ తాను కులం చూసుకోలేదని.. ఎల్లప్పుడూ పేద ప్రజల కోసమే అండగా ఉంటూ తన జీవితాన్ని ధారబోసారని.. పేద ప్రజలకు అభ్యున్నతి కోసం,వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా ఒక ధైర్యంగా ఉండి.. తనకంటూ ఉన్నతమైన ఒక గొప్ప ఆశయంతో కదిలిన గొప్ప నేత అని, ఈ రోజున వారి లేని లోటును ఎవరూ పూడ్చలేనిదని, ఒక చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన గొప్ప మనసున్న మారాజు అని, ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ వారి సేవలను గుర్తు చేసుకుంటూ.. వారిని తలుచుకుంటూ ఈ సందర్భంగా ఘనమైన నివాళులు తెలియజేశారు.