మేము సైతం రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన వరికూటి నాగరాజు

ప్రకాశం జిల్లా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ వారు నిర్వహించిన 3 వ రోజు మేము సైతం (రిలే నిరాహారదీక్ష) కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులతో కలిసి దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపిన విధంగా తెలుగుదేశం పార్టీకి నిరసనలో వరికూటి మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం-జనసేన పొత్తు మీద పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరికూటి నాగరాజు, టిడిపి నాయకులు దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, యాదగిరి వాసు, జనసైనికులు షేక్ ఇర్షాద్, కొండా, న్యాయవాది ఉప్పు హర్ష, పాశం వెంకీ, బండారు సుబ్బారావు, హరికృష్ణ, వీర మహిళ లక్ష్మీ తదితరులు పాల్గొనడం జరిగినది.