వెల్లంపల్లి ఒక అసమర్థ ఎమ్మెల్యే

  • విలేకరుల సమావేశంలో కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం, సొరంగం సెంటర్ వద్ద 48వ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి భయమేస్తుందని రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని ఎమ్మెల్యే పేర్ని నాని మంత్రి పదవి మళ్లీ ఇస్తారని ఊహ ఊహతో పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తన నియోజకవర్గంలో వర్షం పడితే పడవలెత్తి ప్రయాణం చేసే పరిస్థితి ఉందని నియోజకవర్గాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా? ఎప్పుడు కార్యక్రమం చేస్తారా? అని టీవీలు ముందు కూర్చొని ఎదురుచూపులు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ ని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని రాబోయే రోజుల్లో మీ చర్యలకు ప్రజలే గుణపాఠం చెప్తారని పక్క రాష్ట్రాలకు చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులని రాజధాని లేని రాష్ట్రంగా హేళన చేస్తున్నారని, ప్రజలు వైఎస్సార్సీపీ మీద చూపిస్తున్న వ్యతిరేకతనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజల వైపు తొంగి చూడని పాలస్ ప్రభు జగన్ మోహన్ రెడ్డి అని, వారిని ప్రశ్నించాలని, అలాగే ఒక మహిళ అయ్యుండి రోజా ఈ ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు అరాచకాలు జరిగినప్పుడు స్పందించడానికి టైము లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి టైం ఉందా అని, ముందు రోజా తమ శాఖ గురించి పూర్తిగా తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలని ఇది జబర్దస్త్ షో కాదని, అదే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి ఒక అసమర్థ ఎమ్మెల్యే అని అన్నం పెట్టిన చేతిని కరిచే మనస్తత్వం కలిగిన వ్యక్తిని, పశ్చిమ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి జాడే లేదని, తన సొంత స్వలాభానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, మా నాయకుడి మీద అవాకులు చవాకుల పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో 48వ డివిజన్ అధ్యక్షుడు కోరగంజి వెంకటరమణ, విజయవాడ కార్యదర్శి వేరి నాగరాజు పాల్గొన్నారు.