జనసైనికుడి కుటుంబానికి వేమూరు జనసేన ఆర్ధిక సాయం

వేమూరు: ఇటీవల అనారోగ్యంతో మరణించిన అమృతలూరు మండలం జనసైనికుడు అత్తోట మధుబాబు కుటుంబ సభ్యులకు వేమూరు జనసేన నాయకులు 21,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుండి భవిష్యత్ లో కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మండల అధ్యక్షులు మూల్పూరు రమేష్, వేమూరు నియోజకవర్గం జనసేన నాయకులు పోకల శ్రీనివాసరావు, తాటికొండ శివరామకృష్ణ, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, పోకల గోపి, అమృతలూరు మండల జనసేన కమిటీ నాయకులు రత్నశేఖర్, కిషోర్, బొప్పరాజు కోటేశ్వరరావు, యోగేంద్ర, వీరమహిళ నాగేశ్వరి, మరియు కేజీ పాలెం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా జనసేన ఐటీ విభాగం అధ్యక్షులు ముత్తిరెడ్డి రవికృష్ణ సంపూర్ణ సహకారం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.