వారాహియాత్ర విజయవంతం కావాలని వేమూరులో ప్రత్యేక పూజలు

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ ఆధ్వర్యంలో వారాహియాత్ర విజయవంతం అవ్వాలని అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సోమరౌతు అను రాధ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా వేమూరు నియోజవర్గం మండలంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అన్యాయాలు దోపిడీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజవర్గం యొక్క అభివృద్ధిని మరిచిపోయి జేబులు నింపుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జనసేన ప్రభుత్వం రాగానే ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతాను. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి అని వేమూరు నియోజవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అను రాధ తెలియజేయడం జరిగింది. స్వామి ఆశీస్సులు కళ్యాణ్ మీద ఉండాలని, యాత్రకు ఎటువంటి దుష్ట శక్తులు అడ్డురాకుండా 175 నియోజక వర్గాలలో వారాహి యాత్ర విజయవంతం చేయాలని రాబోవు రోజుల్లో రాక్షస ప్రభుత్వానికి చరమ గీతం పాడుతూ, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం, మల్పుర్ రమేష్, బొందలపాటీ మురళి కృష్ణ, అమ్మయ, రాకేష్, ఈశ్వర్, రాంబాబు, డేవిడ్ రాజు, లీల, కిరణ్ , వూసా పవన్, నికిత, సుజాత, పాల్గొన్నారు.