నార్ని తాతాలుకు నివాళులర్పించిన విడివాడ రామచంద్రరావు

నిడదవోలు నియోజకవర్గం, కె సావరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు నార్ని తాతాలు (నానాజీ) అకాల మరణానికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, తులసి, చిన్న, సతీష్ రెల్లు, రాయుడు శ్రీనివాస్ దుర్గేష్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.