తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన విజయలక్ష్మి

అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మిచౌఒగ్ తుఫాన్ నేపథ్యములో కురిసిన భారీ వర్షాలకు 9వార్డులో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లాగార్డెన్ లో పలు చోట్ల వర్షం నీరుతో నిండింది. డ్రైనేజీ సదుపాయం లేక పోవడం, నీరు వెళ్లేందుకు పంట బొదులు నుండివెళ్ళే వాటర్ కూడా నిలిచి పోవడంతో ఇక్కడ నీరువెళ్లే మార్గం లేక నీరు అక్కడికక్కడే నీరు ఉండటం జరిగింది అని 9వవార్డ్ కౌన్సిలర్ (జనసేన) గొలకోటి విజయ లక్మి తెలిపారు. కౌన్సిలర్ నీట ముగినప్రాంతాలను పరిశీలించారు. అమలాపురం పురపాలక చైర్ పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, కమిషనర్ వొమ్మి అయ్యప్ప నాయుడు అధికారులు, రెడ్డి సత్య నారాయణ, గోలకోటి వాసు, పురపాలక అధికారులువార్డులో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు.