నో మై కాన్స్టిట్యూఎన్సీలో భాగంగా శనగలమిట్ట, ఆక్కుర్తి గ్రామాలలో పర్యటించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా అదివారం శ్రీకాళహస్తి మండలంలోని శనగలమిట్ట, అక్కుర్థి గ్రామాలలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

శనగలమిట్ట గ్రామంలో: త్రాగునీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, అంగన్వాడి స్కూల్ భవనం, ప్రైమరీ స్కూల్ భవనం, వీధుల్లో సీసీ రోడ్లు, ఇంటి స్థలాలు, స్మనాన వాటికకు దారి మొదలగు సమస్యలను శ్రీమతి వినుత కోటాకు తెలిపారు.

ఆక్కుర్తి గ్రామంలో: డ్రైనేజీ కాలువలు, స్ట్రీట్ లైట్లు, పారిశుధ్యం మొదలగు సమస్యలు వినుత కోటా దృష్టికి తీసుకుని వచ్చారు.
సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు లక్ష్మణ్ యాదవ్, గణేష్, నితీష్ కుమార్, మణికంఠ,మున్న, సలీం, గిరీష్, అశోక్, సురేష్, మోహన్, పవన్ సాయి, జనసైనికులు పాల్గొన్నారు.