విశాఖ రూరల్: యువశక్తి సన్నాహక సమావేశాలు 7వ రోజు

మాడుగుల: యూత్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పెదపూడి విజయ్ కుమార్ అధ్వర్యంలో విశాఖ రూరల్ నియోజకవర్గాల్లో యువశక్తి సన్నాహక సమావేశాలలో భాగంగా 7వ రోజు కార్యక్రమాలను మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరించి, ఆటో స్టికర్లు, వాల్ ఫ్లెక్సీలు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కృష్ణా మరియు ఈశ్వర్ లకు కమిటీ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అన్నారు.