నెల్లిమర్ల నియోజవర్గంలో గవర ఉదయ్ శ్రీనివాస్ పర్యటన

ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవర్గంలో ఆదివారం రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గవర ఉదయ్ శ్రీనివాస్ (బన్నీ వాసు) పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకం ప్రసాద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వబిలిశేట్టి రామకృష్ణ, రాష్ట్ర ప్రచార సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు, ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ కోట్ల కృష్ణ, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కో ఆర్డినేటర్ పీలా రామకృష్ణ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కో ఆర్డినేటర్ కంచరాన అనిల్, పూసపాటిరేగ మండల అధ్యక్షులు జే.ఏ దొర, భోగాపురం మండల అధ్యక్షులు వందనాల రమణ, ఉత్తరాంధ్ర సోషల్ మీడియా మహేష్ మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, సోషల్ మీడియా టీం మెంబెర్స్ పాల్గొన్నారు.