జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తున్నాం: తంబళ్లపల్లి జనసేన

తంబళ్లపల్లి, జనసేనపార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారినీ విశాఖ పట్టణంలో హోటల్ నుంచీ బయటకు పోనివ్వకుండా పోలీసులు నిర్భందిచడాన్నిఅలాగే అక్రమ అరెస్ట్ చేయడాన్ని తంబళ్లపల్లి జనసేనపార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నమని ప్రజా సమస్యలపై జనసేన పార్టీ నిరంతరం పరిష్కార దిశగా ప్రయాణం చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం చూపకపోగా ఈ అరాచక వైసిపి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తుంది. ఇలాంటి అరెస్టు భయపడేది లేదని తంబళ్లపల్లి జనసేన పార్టీ సమన్వయ బాద్యులు పోతుల సాయినాథ్ ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు అప్రజాస్వామికం, నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర నేతలను సత్వరం విడుదల చేయలి లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురబలకోట మండల అధ్యక్షులు దామోదర్ ములకలచెరువు మండల ప్రధాన కార్యదర్శి మహేష్ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, షోరూం సూరి, జెసిపి శ్రీనివాసులు పాల్గొన్నారు.