చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: జాగారాపు పవన్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండల కేంద్రంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలో టీడీపీ పార్టీ చేస్తున్న దీక్షకు జాగారాపు పవన్ కుమార్ మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మండల కేంద్రంలో టీడీపీ చేపడుతున్న దీక్షలో పాల్గొన్న పెదబయలు మండల జనసేన అధ్యక్షులు జాగారాపు పవన్ కుమార్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వ తిరును తమ పార్టీ పరంగా ఖండిస్తున్నామని జనసేన పెదబయలు మండల అధ్యక్షులు పవన్ కుమార్ తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కనీస ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చెయ్యడం దారుణమన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జీవన్ రవి, కాళ్యాణ్, కరుణ, మోహన్, బుజ్జి బాబు, లక్ష్మణ్, నాగరాజు, రామ్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.