రైతువేధికలే వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి: మొగుళ్ల రఘుమోహన్

వర్ధన్నపేట, ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న కట్ర్యాల క్లస్టర్ రైతువేదిక మందు బాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం సమయం 07 అయితే చాలు అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది. దీనికి కారణం ముమ్మాటికీ పర్యవేక్షణ లోపమే.. రైతు వేదికలకు సీసీ కెమెరాలు లేకపోవటo వల్లనే బాటసారులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే రైతువేదికలకు సీసీ కెమెరాలు అమర్చి అసాంఘిక కార్యకలాపాలకు, మందు బాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలను తీసుకోవాలని పర్వతగిరి మండల జనసేన నాయకులు మొగుళ్ల రఘుమోహన్ కోరారు. ఈ సందర్భంగా రఘుమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతువేదికల వల్ల రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. రైతులకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి సమావేశాలు కూడా రైతువేదికలో జరగకపోవడం విడ్డురం. కేవలం టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులకు, గుత్తేదారులకు లాభం చేకూర్చడానికి ఈ రైతువేదికలు నిర్మించారు. రైతువేధికలే వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అధికారులు ఇప్పటికైనా అరికట్టాలి.