నిమ్మక జయక్రిష్ణ గెలుపుకు కృషి చేస్తాం!

పాలకొండ: ఎం.సింగుపురం గ్రామం నుంచి జనసేనలో చేరిన 250 మంది కూటమి అభ్యర్థి జయకృష్ణ గెలుపునకు మేముంతా నిర్ణయం తీసుకున్నామని ఎం.సింగుపురం గ్రామం జనసేనలో చేరిన కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో జయకృష్ణ ఆధ్వర్యాన 60 కుటుంబాలు నుంచి సుమారు 250 మంది కార్యకర్తలకు జనసేన కండువాలు వేసి జనసేన పార్టీలోకి జయకృష్ణ ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారు బొర్ర రవి, శివ్వాల రాంబాబు, అలజంగి రమేష్ బాబు, మురపాక దుర్గారావు, నేపాకుల సుదీర్, పాతరపల్లి బాగిశెట్టి, గొర్లె సంగమేష్, సవిరిగాన శేఖర్, బత్తిన జగదీశ్, రాజన నవీన్, సవిరిగాన శ్రీనివాస్ రావు, అలుగు శంకర్ రావు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పాలకొండ టౌన్ పార్ట్ అధ్యక్షులు గంట సంతోష్, పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, జనసేన మండల పార్టీ నాయకులు మిడతాన ప్రసాద్, పెనుగొండ రాజశేఖర్, మాదాసి సంతోష్, పోరాడ గజేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.