వైసిపి చెబుతున్న సమగ్ర భూ సర్వే దేని కోసం

  • జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి: పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం, గలవిల్లి గ్రామంలో ఇంతవరకు భూ సర్వే జరగలేదు. అలాగే కొంతమంది రైతులకి పాస్ బుక్ లు అయితే ఉన్నాయి గాని ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు. ఆ గ్రామంలోని రైతులు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే, ఏ పని చేయాలన్నా స్థానిక వైసీపీ లీడర్ మావిడి శ్రీకాంత్ ని వెళ్లి కలవండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?. కొంతమంది ప్రభుత్వాధికారులు రైతుల ద్వారా లంచాలు తీసుకున్నారు కానీ ఇంతవరకు వాళ్ళకి ఏ పని చేయలేదు. ఇదే విషయం మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతులతో ఎమ్మార్వో ను కలవడం జరిగింది? ఆర్.టి.ఐ యాక్ట్ ప్రకారం ఆ గ్రామంలో వెంటనే సమగ్ర భూ సర్వే చేయాలి. పాసుబుక్కులోన రైతులకి వెంటనే ఆ భూమి అప్పజెప్పాలి. ఆ గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది?.. ఇనాం భూములు ఎంత ఉన్నాయి?.. ఈ భూములు ఎవరెవరి దగ్గర ఉన్నాయి మొత్తం వివరాలు చెప్పాలి?. ప్రభుత్వ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి అని చెప్పి, ఎమ్మార్వో గారునీ కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి, వెంటనే స్థానిక విఆర్ఓ గారిని పిలిచి మందలించి, రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహన అధ్యక్షుడు బాబు పాలూరి మరియు, పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు, బలిజిపేట మండల అధ్యక్షుడు బొంకురు పోలినాయుడు, తెర్లాం మండల అధ్యక్షుడు మరడాన రవి, బలిజిపేట మండల నాయకులు, పరుచూరి వెంకటరమణ, నారాయణపురం జనార్ధన్ నాయుడు, నారాయణపురం శివ మామిడి మార్కండేయులు, బొబ్బిలి నియోజకవర్గం నాయకులు సీమల సతీష్, కనకాల శ్యామ్ అల్లు రమేష్, పార్వతిపురం జిల్లా నాయకులు, స్వామి నాయుడు గంటేడ, రఘు మండల అప్పలనాయుడు, నారాయణపురం ఆదినారాయణ, మరియు గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు. కష్టం ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ వాళ్లకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా జనసేన నాయకులు పేర్కొన్నారు.