‘బంగారు బుల్లోడు’ వచ్చేది ఎప్పుడంటే..?

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అయినా అల్లరి నరేష్.. అల్లరి తో ఇండస్ట్రీ కి పరిచమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తో కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నాడు. నరేష్ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అని అంత ఫిక్స్ అయ్యేవారు. కానీ ఈ మధ్య నరేష్ నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.

ఆ మధ్య మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడి పాత్రను అద్భుతం గా పండించినా…ఆ తర్వాత ”అల్లరి” మార్క్ ఎక్సపెక్టషన్స్ ను అందుకోలేక పోతున్నారు. ఐతే ఇప్పుడు న‌రేష్ హీరోగా గిరి పి. ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అల్లరి న‌రేష్ స‌ర‌స‌న కదా నాయిక‌గా పూజా ఝ‌వేరి నటించారు . పాటలు రామజోగయ్య శాస్త్రి రచించగా ..సాయి కార్తీక్ సంగీత సారధ్యం వహించారు. ఈ సినిమా జనవరి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది ..దీనిని పురష్కరించుకొని చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.