షూటింగ్ కంప్లీట్ చేసుకున్న’వైల్డ్ డాగ్’

అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. అందాల భామలు దియా మీర్జా – సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది దానికితోడు కరోనా కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ షూటింగ్ కోసం నాగ్ ఇటీవల హిమాలయాలకు కూడా వెళ్లారు. అక్కడ సినిమా చివరి షడ్యూల్ ను షూట్ చేసారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపిన నాగ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

నా టాలెంటెడ్ టీమ్ కు గుడ్ బై చెప్పాలిసిన సమయం వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు నాగ్. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ , అలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు నాగ్. ఆ తరువాత ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న బంగార్రాజు సినిమాను నాగార్జున పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది.