మోతీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

తెలంగాణ, కూకట్పల్లి జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కి సంఘీభావం తెలియజేస్తూ మోతి నగర్ జనసైనికులు మోతి నగర్ యొక్క ప్రధాన సమస్యలను వారితో చర్చించడం జరిగింది. దానికి ముమ్మారెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలకి పరిష్కారాలు అందిస్తామని మరియు ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా స్వయంగా వారి పాదయాత్రలో వీక్షించి పరిష్కారాలకై ముందుకు సాగుతానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.