ఈ చిట్కాల తో మీ ముఖం పై నల్లటి మచ్చలు మాయం..

చాలా మందికి ముఖం మీద మొటిమలు తగ్గినా కానీ వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు మాత్రం తగ్గవు. ఈ మచ్చలు తగ్గటానికి చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటించండి.

ఒక బౌల్ లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. ఎఫెక్ట్ అయిన ఏరియా మీద ఈ పేస్ట్ అప్లై చేసి ఐదు నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత ఇరవై నిమిషాల పాటూ వదిలేయండి. గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒక సారి ఈ చిట్కా పాటించండి.

ఫ్రెష్ అలో వెరా పల్ప్ రెండు టేబుల్ స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకుని రెండింటినీ బాగా కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒక సారి రెండు మూడు వారాలు చేయవచ్చు. ఆ తరువాత రోజు విడిచి రోజు చేయవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమలా పండు తొక్కల పొడి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టీ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, తగినంత నీరు కలిపి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరనివ్వండి. ఆరిన తరువాత కొద్ది గా నీరు చల్లి మీ వేళ్ళతో గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. వారానికి మూడు నాలుగు సార్లు ఇలా చేయవచ్చు.

రెండు మూడు టేబుల్ స్పూన్ల గంధం పొడి లో ఒక టీ స్పూన్ పసుపు, తగినన్ని పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేయవచ్చు. ఇందు వల్ల పిగ్మెంటేషన్ పోవడమే కాదు, మళ్ళీ రాకుండా ఉంటుంది.