నందలూరు మండలంలో పర్యటించిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలంలోని గ్రామాలలో బుధవారం జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు పర్యటించడం జరిగింది. అరవపల్లె, నీలిపల్లెకి చెందిన తాటి లక్ష్మీదేవి, ఎల్ఐసి సుబ్బయ్య, సుధాకర్ మాజీ వార్డ్ మెంబర్, నాగేంద్ర మాజీ ఎంపీటీసీ, మునిస్వామి మాజీ ఎంపీటీసీ, అల్లం అశోక్ కుమార్, పెంచలయ్య, పుత్తా వెంకటేష్, కుర్రా ముని, సహజాన్, నరేంద్ర, పి.సుబ్రహ్మణ్యం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీని కలిసి వారందరిని ఈ నెల 29న నందలూరులో జనసేన పార్టీ కార్యాలయము ప్రారంభోత్సవమునకు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, జనసేన నాయకులు ఆకుల చలపతి, మాజీ సర్పంచ్ సమ్నెట శివప్రసాద్, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్ మాజీ ఎం.పి.టి.సి చల్లా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.