మెగాస్టార్ ను విమర్శించే స్థాయి వైసీపీ మంత్రులకు లేదు: షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు నియోజకవర్గం: మెగా స్టార్ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఏ పాలేరు వైసిపి మాజీ మంత్రులకు లేదని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చిరంజీవి గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము హోదాపై, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలి పేదలకు ఆకలి నింపాలని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా పరుసు మీద రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరును భారతదేశ పౌరుడిగా చెప్పడం జరిగింది. అదే అదునుగా చూసుకున్న వైసీపీ మాజీ మంత్రులు చిరంజీవి గారి మీద ఎదురుదాడి చేస్తున్నారని, చిత్ర పరిశ్రమంలో ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న చిరంజీవి గారి మీద రాద్ధాంతం చేయడము తగదని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను ముఖ్యమంత్రి గారికి 20024లో రాష్ట్ర ప్రజలు తగిన పాఠం చెప్తారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారిని విమర్శించే స్థాయి ఏ ఒక్క పాలేరు మంత్రులకు లేదని, అది ఎలాంటి వారైనా సరే ఎవడిని వదిలే ప్రసక్తే లేదని మీరు మంత్రులు ఏంట్రా ఆయన కాలిగోటికి కూడా పనికిరారు ఖబర్దార్ వైసిపి!! చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, మంత్రులుగా ఎప్పుడైనా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడారా మీరు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరమైనా రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేయలేదు అదేవిధంగా చిరంజీవి జోలికి వస్తే జనసేన పార్టీ నాయకులు మరియు మెగా అభిమానులు మీ తాట తీస్తామని హెచ్చరించారు.