వంశీకృష్ణ యాదవ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ సీనియర్ మహిళా నేతలు, యువకులు

విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో 21వ వార్డ్ వైసీపీ మాజీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జనపాన పద్మ, వైసీపీ 13వ వార్డ్ మహిళా సీనియర్ నాయకురాలు శ్రీమతి భూసు వరలక్ష్మి, 11వ వార్డ్ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి పిట్టా ఆదిలక్ష్మీ రెడ్డి, 10వ వార్డ్ మహిళా నాయకురాలు శ్రీమతి శ్రావణి, 28వ వార్డ్ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి అరుణశ్రీ, 12వ వార్డ్ మహిళా నాయకురాలు శ్రీమతి కుమారి, 17వ వార్డ్ సుమారు 100 కుటుంబాలు మరియు గాజువాక నియోజకవర్గ పరిధిలో 85వ వార్డ్ యువజన విభాగం అధ్యక్షులు ఇళ్లపు వాసు, వైసీపీ సీనియర్ నాయకులు అయితి అప్పలరాజు, వైసీపీ నాయకులు ఏదురి అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు వంశీ జనసేన కండువా వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీలో ప్రత్యేక గుర్తింపు వుంటుందని, లాభాపేక్ష లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభివాదం తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పార్టీలో అన్ని విభాగాల కమిటీలు త్వరలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.