ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై ద్వజమెత్తిన యుగంధర్

  • నీ కులానికి ఏమి చేసావు స్వామీ
  • నీ బావమరిదికి ఇచ్చిన సర్పంచ్ పదవి అభివృద్దా?
  • నీ భార్యకిచ్చిన జడ్పీటీసీ వృద్ధి చేయడమా?
  • నీ తదనంతర వారసులు నీ అనుచర గణమా?
  • ఏది నీ కులానికి చేసిన మేలు
  • ద్వజమెత్తిన జనసేన ఇంచార్జి యుగంధర్

గంగాధర నెల్లూరు: కార్వేటి నగరం మండలం గడపగడపలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ ప్రతిస్పందించారు. అయన మాట్లాడుతూ భీమవరం, గాజువాకలో గెలిచిన మీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఏమి పీకారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కులానికి నువ్వు ఏమి చేసావు? నీ బావమరిదికి సర్పంచి ఇచ్చావు. నీ భార్యకు జెడ్‌పిటిసి ఇచ్చావు. నీ సంతానాన్ని అభివృద్ధి పరిచావు. అంతే తప్ప ఆరు మండలాల్లో ఒక ఎస్సీ గ్రామానైనా రోల్ మోడల్ చేసావా? నిన్ను నమ్ముకున్న నీ కులానికి నువ్వు చేసింది ఏమి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నీ స్వార్థం కోసం ఎస్ఆర్ పురం మండల జడ్పిటిసి రిజర్వేషన్ మార్చావు. నీ స్వలాభం కోసం కార్వేటినగరం మండల జడ్పిటిసి రిజర్వేషన్ మార్చావని ఎద్దేవా చేశారు. ఒక్క దళిత నాయకుడినైనా ఈ నియోజకవర్గ నుండి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులను చేసావా? అలాంటి అవివేకి నువ్వా కులం గురించి మాట్లాడేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోనీ మిగతా కులాలు బాగుపడ్డాయా అంటే బీసీ ఓసి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ప్రజల్లో ఎవరిలోనూ మెరుగైన అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవసేవయే మాధవసేవ అంటే, కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం, వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం, కార్వేటి నగరం నుండి కొత్తపల్లి మిట్ట వరకు డబల్ రోడ్డు వేయడం, గంగాధర్ నెల్లూరు బ్రిడ్జిని వెడల్పు చేయడం, వెదురు కుప్పం మండలంలో డిగ్రీ కాలేజీ కట్టడం, ఆర్ కే వి బి పేట గ్రామంలో రోడ్డు వేయడం దీనిని మానవసేవయే మాధవసేవ అంటారని తెలియజేసారు. నిన్ను 2024 సంవత్సరంలో నీతో కూడా ఉండేవాళ్లు, నియోజకవర్గంలో ప్రజలు ఇంటికి సాగనంపుతారని జోష్యం పలికారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ ఉన్నారు.