పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జరాకి బంగారు పతకం

  • అభినందించిన గురాన అయ్యలు

విజయనగరం: బెంగళూరులో నవంబర్ 22 తేదీ నుండి 26 తేదీ వరకు జరిగిన 28వ జాతీయ బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ లో విజయనగరానికి చెందిన ఎస్.జరా 69 కేజీల మహిళా విభాగంలో 90 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు బుధవారం ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.