అమరాపురం జనసేన నాయకులు ఆనంద్ కృష్ణ మరియు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం

మడకశిర, అమరాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ మీటింగును మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలోఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం.ఆనంద్ కృష్ణ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని అలాగే ఈ మండల కమిటీ గురించి ప్రతి పంచాయితీలలో కూడా ఈ మండల కమిటీలో తప్పక ఉండాలన్నారు. అలాగే త్వరలో గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు కూడా జరుగుతాయన్నారు. అలాగే అమరాపురం నుండి, హేమావతి నుండి పలువురు పార్టీలోకి చేరడం జరిగింది వారికి జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నవీన్ కుమార్ నాయకులు ఆనంద కృష్ణకి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాఫీక్, లింగరాజు, నాగరాజు, హరీష్, హనుమంత రాయ, త్యాగరాజు, నవీన్, అనిల్, రుషి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.