• పిఠాపురం నియోజకవర్గంలోని 42 మందికి జులై నెల జీతాన్ని పంపిన పవన్ కళ్యాణ్
• జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ.5 వేల చొప్పున చెక్కుల పంపిణీ
పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు అండగా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్ధేశ్యంతో స్థానిక శాసనసభ్యునిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రతి నెలా తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిథిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం 42 మంది అనాథ పిల్లలను గుర్తించి వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున అందిస్తున్నారు. కన్నవారికి దూరమై అనాథలుగా మిగిలిన వీరిని భగవంతుని పిల్లలుగా పిలిచేందుకే పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. భగవంతుడు వీరిని ఏదో గొప్ప కార్యం నిమిత్తం పుట్టించి ఉంటాడని నమ్ముతారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా స్వీకరించిన పవన్ కళ్యాణ్…. ఓ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకొని శాసనసభ్యునిగా తనకు వచ్చే జీతాన్ని నెల నెల వారి బాగోగులు చూసేందుకు పంపుతున్నారు. జులై నెల జీతాన్ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల ద్వారా నేరుగా ఆ 42 మంది పిల్లల ఇళ్లకు పంపారు. తద్వారా జనసేన శ్రేణులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. తన నియోజవర్గం పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో….వారికి నాణ్యమైన ఆహారం, దుస్తులు, చదువు తదితర అవసరాలు తీర్చేందుకు శాసనసభ్యునిగా, ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులు బాగుండాలన్నదే ఆయన ఆలోచన. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలిసిన నాయకులు ఉన్న నేటి రాజకీయ వ్యవస్థలో తన కష్టార్జితాన్ని ప్రజల కోసం దానం చేస్తున్న గొప్ప మనసు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం పరిథిలోని జనసేన క్రియాశీలక సభ్యులంతా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి చిన్నారి ఇంటికి వెళ్లి మరీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కులను అందజేశారు. పవన్ కళ్యాణ్ మనుషులుగా అండగా నిలిచేందుకు మీ వద్దకు వచ్చామని, మీ కోసం మేమున్నామన్న భరోసా ఇచ్చారు. మూడు నెలల క్రితం మే 9వ తేదీన మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన నియోజకవర్గం పరిధిలోని అనాథ పిల్లలను పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి అదే భరోసా ఇచ్చారు. ఆ చిన్నారులు తల్లిదండ్రులు లేరన్న బాధను అధిగమించి ఈ సమాజం మొత్తం మీకు తోడుగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం.

Share this content:
Post Comment