పీవీకి బారతరత్న పురస్కారంపై అసెంబ్లీ తీర్మానానికి నిర్ణయం

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ…తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావు తైల వర్ణ చిత్రాన్ని పెడతామని…అటు పార్లమెంట్ లో కూడా పెట్టే విధంగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తామన్నారు కేసీఆర్. మరోవైపు నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరు పెడతామని చెప్పారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ను నిర్మించనున్నట్టు ప్రకటించారు.

భారతదేశంలో అనేక ఆర్ధిక సంస్కరణలు అమలు చేసిన మహనీయుడని..ప్రపంచం గుర్తించిన మహా మనిషని కేసీఆర్ పీవీను కీర్తించారు. అంతటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పీవీ నెలకొల్పిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కు సైతం ఆయన పేరు పెట్టేలా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో మరో తీర్మానం చేస్తామన్నారు.