శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12వ రోజు KNOW MY CONSTITUENCY
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-7.45.38-PM-1024x576.jpeg)
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని NTR నగర్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, ఇళ్ళపట్టాలు, నిత్యావసర ధరల విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు పూట గడవడం కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్ కి, జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని శ్రీమతి వినుత ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు శ్రీ రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు శ్రీ కిరణ్, నాయకులు మణికంఠ, ప్రమోద్, సురేష్, నితీష్, కిషోర్, చందు, గిరీష్, మునిశేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.42-PM-3-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.42-PM-2-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.41-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.41-PM-3-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.40-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.39-PM-3-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-08-at-8.07.39-PM-2-1024x576.jpeg)