HPCL లో 200 జాబ్స్‌..

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సంబంధింత విభాగంలో ఇంజనీరింగ్ (బీటెక్‌/బీఈ) పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 200

మెకానికల్‌ ఇంజినీర్‌ – 120

సివిల్‌ ఇంజినీర్‌ – 30

ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ – 25

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ – 25

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఫుల్‌టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్‌టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1180 (రిజర్వేషన్ల వారీగా ఫీజు మినహాయింపు ఉంటుంది)

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 15, 2021

వెబ్‌సైట్‌:https://www.hindustanpetroleum.com/