యూపీఎస్‌సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్… ఖాళీల వివరాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

ఖాళీల వివరాలు…

మొత్తం ఖాళీలు- 5

లేడీ మెడికల్ ఆఫీసర్ (ఫ్యామిలీ వెల్‌ఫేర్)- 2

ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)- 1

షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్)- 1

అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఆర్కిటెక్ట్- 1

గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 1

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 ఏప్రిల్ 2

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

అప్లై చేయండి ఇలా…

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి.

అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.

దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.

ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.