సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 27న నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. అభ్యర్థులంతా వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూపీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా.. సీఎస్ఈ-2021, ఐఎఫ్‌వోఎస్ఈ-2021 లకు గాను పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల వయస్సుతోపాటు.. కొన్ని సడలింపులు చేయనున్నట్లు సమాచారం.

కాగా.. ప్రతి ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌, ఇండియన్ పోలీస్ సర్వీస్‌, ఇతర సివిల్ సర్వీసెస్‌కు గాను అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనిలో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను.. ఆ తర్వాత మెయిన్స్‌ను నిర్వహిస్తారు. అనంతరం ర్యాంకు సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.