జనచైతన్య శంఖారావం 21వ రోజు

రాజమండ్రి రూరల్, జనచైతన్య శంఖారావ కార్యక్రమం 21వ రోజు ధవళేశ్వరం గ్రామం ఎర్రకొండ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతవాసులు సమస్యలతో స్వాగతం చెప్పారు పంచాయతీ వారికి సమస్య చెప్పినా సమయానికి రారని, ప్రధాన సమస్యలైన రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్య, గురించి కాలనీవాసులు దుర్గేష్ కి చెప్పడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మార్పు మొదలయ్యిందని, జనం మార్పు కోరుకుంటున్నారని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై విసిగిపోయిన జనం జనసేన పార్టీ వైపు చూస్తున్నారని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడే ఈ రాష్ట్రానికి అవసరమని దుర్గేష్ చెప్పటం జరిగింది. ఈ ధవళేశ్వరంలాంటి గ్రామంలో మరీ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య కనబడుతుందని ఆ సమస్యలు తీర్చగలిగినవే అయినా సరే పట్టించుకునే నాధుడే లేడని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లి వెంకటరమణ, పిల్లి దుర్గా, శ్రీను, రామకృష్ణ, అప్పలకొండ, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, వరే రమేష్, మట్టపర్తి నాగరాజు, ఆవల శివ, దూది సాయి, దారపు శివారెడ్డి, సునీల్, సూరాడ సత్తిబాబు, సికోటి శివాజీ, ఐటీ శ్రీను మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.