ఇండియన్ నేవీలో 230 జాబ్స్..
ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ నేవీ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొచ్చిలోని నావల్ షిప్‌యార్డ్‌లో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ స్కూల్లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 230 పోస్టుల్ని ప్రకటిస్తూ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 1
విద్యార్హతలు- మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో 65 శాతం మార్కులతో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 21 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్‌లో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం- అభ్యర్థులు క్రింది లింకు http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10702_21_2122b.pdf లో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.