TS PECET 2020 దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఆగస్టు 31వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ ఏడాది TS PECET 2020 నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ చూడగలరు. https://pecet.tsche.ac.in

బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) ఫస్ట్ ఇయర్‌లో చేరాలనుకునేవారు టీఎస్ పీఈసెట్ (TS-PECET 2020)  పరీక్ష రాయాల్సి ఉంటుంది. ముందుగా మే 13న పీఈ సెట్ పరీక్ష షెడ్యూలు ఖరారు చేసినా కరోనా కారణంగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.