కశ్మీర్‌లో మళ్లీ 4జీ సేవలు

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు పునఃప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే 4జీ సేవలను మాత్రం 18 నెలల తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జమ్మూకశ్మీర్ పరిపాలన అధికారి రోహిత్ కన్సాల్ తెలిపారు. 2019, ఆగస్టు 5వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం విదితమే.