51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా..

ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను (ఇఫి) గోవా ప్రభుత్వం వాయిదావేసింది. నవంబర్ 20 నుంచి 28 వరకు జరగాల్సిన ఇఫీ ఉత్సవాల కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్సవాలను వచ్చేడాది జనవరి 16 నుంచి 24 వరకు నిర్వహిస్తామని తెలిపింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందని ఇటీవల గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ఈసారి హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఐబీ మంత్రిత్వశాఖ సూచనల మేరకు.. ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో సినిమాలను అఫిషియల్ డిజిటల్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నారు. గోవా సీఎం మాత్రం ఫెస్టివల్ మార్పు గురించి కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం అందలేదన్నారు. డైరక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, గోవా ఎంటర్‌టైన్మెంట్ సోసైటీ సంయుక్తంగా ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి. గత ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్‌లో 76 దేశాలకు చెందిన 200 సినిమాలను స్క్రీనింగ్ చేశారు. అనంతరం ఉత్సవాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నిబంధనల ప్రకారం వచ్చే జనవరిలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియాకు గోవా శాశ్వత  వేదికగా ఉన్న విషయం తెలిసిందే.