జనజాగృతి యాత్ర 63వ రోజు

రాజానగరం: జనజాగృతి యత్ర 63వ రోజులో భాగంగా శనివారం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామంలో ఉదయాన్నే పల్లె బాటలో భాగంగా ఉపాధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఉపాధి హామీ రైతుకూలీలతో ముఖముఖి చర్చ ముగిసిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల ఉపాధి హామీ రైతుకూలీలకు మజ్జిగ పంపిణి మేడ గురుదత్ ప్రసాద్ చేసారు. ఈ కార్యక్రమం రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, తూర్పుగానుగూడెం &ఫరిజల్లిపేట గ్రామాల జనసేన పార్టీ ఎంపీటీసీ పల్లా నాగు, రాజానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ నాగవరుపు భానుశంకర్, రాజానగరం మండలం సీనియర్ నాయకులు మన్య శ్రీను, చెల్లూరి రాజు, ముద్దాల బ్రమ్మం, మన్య వెంకన్న బాబు, వళవల తాతఅబ్బయి వల్లేపల్లి రాజేష్, పెద్ద కాపు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.