అనంతపురం జనసేన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

  • మట్టి గణనాథుని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం సుస్థిరాభివృద్దిని కొనసాగిద్దాం
  • రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం: జనసేన ఆధ్వర్యంలో పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు సోమవారం వినాయక చవితిని పురస్కరించుకొని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటయిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని ప్రతిమకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వేదపండితుల ఆశిర్వచలాను తీసుకున్నారు.. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితులు కావాలని మట్టి వినాయకుణ్ణి పూజించడం ద్వారా జల చర జీవరాశులను కాపాడిన వారిమౌతామంటు అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి,రాక్షస పాలన కొన సాగుతుందని ఇటు వంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లేకుండా పోవాలని మనమందరం ఆ గణనాథుని వేడుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు శైలజ, లక్ష్మి, గాయత్రి జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.